priyanka chopra: ప్రియాంక చోప్రాతో నిక్‌ జొనాన్‌ది బలవంతపు పెళ్లట.. ‘ది కట్‌’ మ్యాగజైన్‌ కథనం

  • అతను ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు...ఆమె తన వాడిని చేసుకోవాలనుకుందని విశ్లేషణ
  • అవన్నీ పిచ్చి వార్తలని కొట్టిపారేసిన బాలీవుడ్‌ సుందరి
  • ప్రస్తుతం నేను వివాహ ఆనందాన్ని అనుభవిస్తున్నానని వెల్లడి

అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాన్‌ను ఇటీవలే పెళ్లి చేసుకుని సంతోష సాగరంలో విహరిస్తున్న బాలీవుడ్‌ సుందరి ప్రియాంకా చోప్రా ఉత్సాహంపై న్యూయార్క్‌ నుంచి వెలువడే ‘ది కట్‌’ మ్యాగజైన్‌ నీళ్లు చల్లింది. ప్రియాంక చోప్రాతో నిక్‌ జొనాన్‌ది బలవంతపు పెళ్లంటూ ఓ కథనాన్ని ప్రచురించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

మ్యాగజైన్‌ విలేకరి మారియా స్మిత్‌ ఈ కథనం రాస్తూ ‘నిక్‌కు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. కాకపోతే ఇప్పుడిప్పుడే హాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ బాలీవుడ్‌ సుందరితో పరిచయం పెంచుకుని సరదాగా ఎంజాయ్‌ చేయాలనుకున్నాడు. కానీ గ్లోబల్‌ స్కాం ఆర్టిస్ట్‌ అయిన ప్రియాంక అతన్ని ఏకంగా పెళ్లి పీటల వరకు నడిపించి తనను వివాహం చేసుకునేలా చేసింది’ అంటూ కథనాన్ని ప్రచురించింది.

మ్యాగజైన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ కథనాన్ని పోస్టు చేసింది. ఈ కథనంపై ప్రియాంకా చోప్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అదో పిచ్చి కథనం. ఇటువంటి వాటిని నేను అస్సలు పట్టించుకోను. ప్రస్తుతం నా వివాహ జీవితం సంతోషంగా గడుస్తోంది. ఇటువంటి వార్తలు నన్ను డిస్టర్బ్‌ చేయలేవు’ అంటూ స్పష్టం చేసింది.

ఈ కథనంపై నిక్‌ సోదరుడు జో జొనాస్‌ స్పందిస్తూ ‘ఇది చాలా అసహ్యకరమైన కథనం. ఒక మహిళ గురించి ఇలాంటి కథనం రాసినందుకు ఆ పత్రిక సిగ్గుపడాలి’ అని మండిపడ్డారు. నిక్‌, ప్రియాంకలది నిజమైన ప్రేమని సమర్ధించారు. కాగా, ఈ కథనంపై పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఆడవాళ్ల గురించి గొప్పగా రాసే ది కట్‌ మ్యాగజైన్‌ ప్రియాంకపై జాతి వివక్షతో రాసిన కథనం ఇది’ అంటూ సోనమ్‌కపూర్‌ వ్యాఖ్యానించింది. మరోపక్క, కథనంపై పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించిన మ్యాగజైన్‌ నిర్వాహకులు తమ వెబ్‌సైట్‌ నుంచి దాన్ని తొలగించారు.

priyanka chopra
nick jonan
the cut magzine
  • Loading...

More Telugu News