Andhra Pradesh: జగన్ @ 3,390 కిలోమీటర్లు.. శ్రీకాకుళంలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర!

  • ఈరోజు ఉదయం రెడ్డిపేటలో ప్రారంభం
  • ప్రజలను కలుసుకుంటూ ముందుకెళుతున్న జగన్
  • చిలకలపాలెంలో సాయంత్రం బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో సాగుతోంది. జిల్లాలోని రెడ్డిపేట శివారులో ఈరోజు ఉదయం 314వ రోజు జగన్ పాదయాత్ర మొదలయింది. అక్కడి నుంచి లోలుగు, నందివాడ క్రాస్‌, నర్సాపురం అగ్రహారం, కేశవదాసుపురం క్రాస్‌, చిలకలపాలెం మీదుగా ఎచ్చెర్ల వరకు జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ చిలకల పాలెం వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అనంతరం ఎచ్చెర్ల వద్ద రాత్రికి విశ్రాంతి తీసుకోనున్నారు. జగన్ ను కలుసుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, పాదయాత్రకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,390.3 కిలోమీటర్లు నడిచారు.

Andhra Pradesh
YSRCP
Jagan
prajasankalpa yatra
Srikakulam District
3390.3 km
meeting
  • Loading...

More Telugu News