Andhra Pradesh: బాబుకు ‘చర్లపల్లి’ భయం పట్టుకుంది.. అందుకే తెలంగాణలో మరో రూ.500 కోట్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు!: విజయసాయిరెడ్డి

  • ఇప్పటికే తెలంగాణలో రూ.1,200 కోట్లు పెట్టారు
  • టీఆర్ఎస్ గెలుస్తుందని బాబుకు భయం పట్టుకుంది
  • ఉత్తమ్ ను అర్ధరాత్రి ఇంటికి పిలిపించారు

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధిస్తే చర్లపల్లి జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. ఓటుకు నోటు కేసులో విచారణ చివరిదశకు చేరుకున్నందున బాబు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వ్యాఖ్యానించారు.

దీంతో చంద్రబాబు నిన్న రాత్రి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని తన ఇంటికి పిలిపించుకున్నారని ఆరోపించారు. ఇప్పటికే తాను ఇచ్చిన రూ.1,200 కోట్లు సరిపోకపోతే మరో రూ.500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు సూచించారన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam
Uttam Kumar Reddy
Congress
500crores
1200 crores
charlapalli jail
  • Loading...

More Telugu News