vijay: సంక్రాంతికి విజయ్ సినిమా లాంచ్

  • అట్లీ కుమార్ తో విజయ్ 
  • ఇద్దరి కాంబినేషన్లో మూడో మూవీ 
  • హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదల  

ఒక రెండేళ్ల వరకూ అభిమానులు మరిచిపోలేనంత ఆనందాన్ని 'సర్కార్'తో ఇచ్చిన విజయ్, తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నాడు. విజయ్ తొందరపెట్టడంతో పూర్తి స్క్రిప్ట్ ను దర్శకుడు అట్లీ కుమార్ ఆయనకి వినిపించాడట. విజయ్ అక్కడక్కడా కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పాడట. ప్రస్తుతం అట్లీ కుమార్ ఆ పనుల్లోనే వున్నాడని అంటున్నారు.

సంక్రాంతికి ఈ సినిమాను లాంచ్ చేయాలని విజయ్ గట్టిగా చెప్పడంతో, అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి. సంక్రాంతి రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తేరి' .. 'మెర్సల్' భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందువలన ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ ఇద్దరూ వున్నారు. అది తప్పకుండా జరిగితీరుతుందనేది అభిమానుల మాట.      

  • Loading...

More Telugu News