Lagadapati Rajagopal: కూటమి గెలుస్తుందని లగడపాటి చెబుతుంటే... టీఆర్ఎస్ ను గెలిపించాలని కోరిన ఆయన భార్య పద్మ!

  • ప్రజల నాడి హస్తం వైపుందన్న రాజగోపాల్
  • దానం నాగేందర్ తరఫున ప్రచారం చేసిన పద్మ
  • కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు

తన భర్త లగడపాటి రాజగోపాల్, తెలంగాణ ఎన్నికల్లో ప్రజల నాడి కూటమి వైపు ఉందని, కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతుంటే, ఆయన భార్య లగడపాటి పద్మ మాత్రం టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రచారం చేశారు. హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మక నియోజకవర్గమైన ఖైరతాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న దానం నాగేందర్ భార్య అనితతో కలసి పలు బస్తీల్లో ఆమె ప్రచారం చేశారు.

దానం నాగేందర్‌ అన్నను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. గతంలో పాలించిన ఏ ప్రభుత్వమూ చేయనంత అభివృద్ధిని టీఆర్ఎస్ చేసి చూపిందని, మరో పదేళ్లలో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

Lagadapati Rajagopal
Padma
Danam Nagender
Anita
Khairatabad
Telangana
  • Loading...

More Telugu News