RX100: 'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతికి పితృ వియోగం!

  • కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వేగేశ్న రామరాజు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • 11 రోజుల పాటు నిత్య కర్మ

సినీ దర్శకుడు, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్‌ భూపతి తండ్రి వేగేశ్న రామరాజు కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన, రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు మరణించారు.

రామరాజు కుమారుడు అజయ్‌భూపతి సక్సెస్‌ సాధించిన డైరెక్టర్‌ గా నిలువగా, ఆయన కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆమె బయలుదేరారని, రాగానే అంత్యక్రియలు జరుగుతాయని రామరాజు కుటుంబీకులు తెలిపారు. స్వగ్రామం ఆత్రేయపురంలో 11 రోజులపాటు నిత్యకర్మలను జరిపించాలని నిర్ణయించామని, అజయ్ భూపతి స్వయంగా వీటిని నిర్వహిస్తారని తెలిపారు.

RX100
Ajay Bhupati
Vegesna Ramaraju
Died
  • Loading...

More Telugu News