jupudi prabhakar: కూకట్‌పల్లిలో డబ్బు కట్టల కలకలం.. టీడీపీ నేత జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు

  • జూపూడి ఇంట్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
  • డబ్బు సంచులతో పారిపోతున్న ఇద్దరిని పట్టుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
  • జూపూడిని అరెస్ట్ చేయాలని డిమాండ్

టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఇంటి నుంచి డబ్బు మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం కలకలం రేపుతోంది.  బాలాజీనగర్‌లోని ప్రభాకర్ ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు.

 ఈ క్రమంలో ఆయన ఇంటి వెనక నుంచి డబ్బు మూటలతో పారిపోతున్న వ్యక్తులను టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించిన నేతలు జూపూడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు డబ్బు సంచులతో పారిపోయినట్టు చెబుతున్నారు.

ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ ప్రకారమే జూపూడి ఇంట్లో డబ్బులు పెట్టారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్న ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

jupudi prabhakar
Andhra Pradesh
Telugudesam
Kukatpally
TRS
Police
  • Loading...

More Telugu News