Hyderabad: హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు రేపు సెలవు

  • హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రకటన
  • ఎల్లుండి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • రేపు ఎన్నికల సామగ్రి తరలింపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రఘునందనరావు తెలియజేశారు. ఎల్లుండి ఎన్నికల పోలింగ్ నిమిత్తం ఈవీఎంల తరలింపు, తదితర కారణాల నేపథ్యంలోనే సెలవు ప్రకటించినట్టు సమాచారం. కాగా, 7న ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 7న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీస్ ఇన్ ఛార్జిలను ఎన్నికల కమిషన్ నియమించింది. హైదరాబాద్ కు మల్లారెడ్డిని, సిద్ధిపేటకు స్వాతి లక్రాను, వికారాబాద్ కు శ్రీనివాసరావును, సూర్యాపేటకు ఖాసీంను, షాద్ నగర్ కు జానకీ షర్మిల, మేడ్చల్ కు విజయ్ కుమార్, రంగారెడ్డికి పరిమళా నూతన్ తో పాటు తదితర అధికారులను నియమించింది.

Hyderabad
government offices
educational institutions
collector
  • Loading...

More Telugu News