akkinenei amala: ప్లీజ్.. డిసెంబర్ 7న తప్పకుండా ఓటెయ్యండి: అక్కినేని అమల

  • ఓటు వేయడం చాలా ముఖ్యమైన విషయం
  • హైదరాబాద్ లో పోలింగ్ శాతం  తక్కువని విన్నాను
  • ఇది మంచి విషయం కాదు

ప్రజాస్వామ్యంలో ఓటు వేయడమనేది చాలా ముఖ్యమైన విషయమని ప్రముఖ సినీ నటి అక్కినేని అమల అన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్ లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుందని విన్నానని, ఇది మంచి విషయం కాదని అన్నారు. ఎవరికి ఓటు వెయ్యాలి? ఎందుకు ఓటు వెయ్యాలి? అనే విషయాలను అర్థం చేసుకుని ఓటేస్తేనే మన దేశం బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ప్లీజ్.. డిసెంబర్ 7న తప్పకుండా ఓటెయ్యండి’ అని అమల కోరారు.

akkinenei amala
december 7
elections
  • Loading...

More Telugu News