Karnataka: జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోవడం ఖాయం: కేంద్ర మంత్రి జవదేకర్

  • జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలది అపవిత్ర కలయిక
  • అంతర్గత విభేదాలతోనే వారి ప్రభుత్వం కూలుతుంది
  • కర్ణాటకలో మా పార్టీ ఆపరేషన్ మొదలైంది

కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలది అపవిత్ర కలయికని, అంతర్గత విభేదాల కారణంగానే వారి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఆపరేషన్ మొదలైందని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే లోపే తమ కొత్త వ్యూహం అమలవుతుందని, కర్ణాటకలో పొలిటికల్ ధమాకా చూడబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Karnataka
javadekar
jds-congress
  • Loading...

More Telugu News