Yogi Adityanath: ముస్లింలకు తాయిలాలు మేనిఫెస్టోలో మాత్రమే ఉంటాయి!: కరీంనగర్ సభలో యూపీ సీఎం యోగి

  • నిజాం ప్రభువులను పొగిడేందుకే పరిమితమయ్యాయి
  • నక్సలిజాన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది
  • బీజేపీ మినహా అన్నీ కుటుంబ పార్టీలే

తెలంగాణలో బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ నిజాం ప్రభువులను పొగిడేందుకే పరిమితమయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కరీంనగర్‌లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో యోగి మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు విభజించు - పాలించు అనే సూత్రం ఆధారంగా పని చేస్తాయని ఆరోపించారు.

బీజేపీని గెలిపిస్తే కరీంనగర్‌ పేరును కరిపురంగా మారుస్తామని యోగి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నక్సలిజాన్ని అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. బీజేపీ మినహా మిగిలిన అన్నీ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ముస్లింలకు తాయిలాలు టీడీపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రమే ఉంటాయని.. నిజానికి వారి సంక్షేమం కోసం ఎటువంటి కార్యక్రమాలూ చేపట్టరని యోగి ఆరోపించారు.

Yogi Adityanath
Karimnagar
BJP
TRS
Congress
Narendra Modi
  • Loading...

More Telugu News