tambi durai: లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకు గుండెపోటు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-53444b7161f7223a1a0d808845696c3c5f1ade63.jpg)
- చెన్నైలో ఉండగా ఆయనకు గుండెపోటుకు
- అపోలో ఆసుపత్రికి తరలించిన సహాయక సిబ్బంది
- ‘యాంజియో గ్రామ్’ నిర్వహించిన వైద్యులు
లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నా డీఎంకే సీనియర్ తంబిదురైకు ఈరోజు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. చెన్నైలో ఉండగా గుండెపోటుకు గురైన ఆయన్ని వెంటనే సహాయక సిబ్బంది అక్కడి అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు ‘యాంజియో గ్రామ్’ను నిర్వహించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ఆయన ప్రాణాలతో బయటపడినట్టు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.