bellamkonda: కలర్ ఫుల్ గా 'కవచం' సాంగ్

  • దర్శకుడిగా శ్రీనివాస్ మామిళ్ల 
  • తమన్ స్వరపరిచిన బాణీ
  • ఈ నెల 7వ తేదీన విడుదల  

శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన 'కవచం' సినిమా ఈ నెల 7వ తేదీన ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ .. కాజల్ .. మెహ్రీన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. "నా అడుగే పడితే అణుయుద్ధం .. మొదలవుతుంది అనునిత్యం .. అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో. నే చిటికే వేస్తే భూగోళం .. వెళ్లిపోతుంది పాతాళం .. అని ఎక్కడ లేని బిల్డప్ ఇవ్వను బ్రో .." అంటూ ఈ పాట కొనసాగుతోంది.

తన స్వభావం గురించి హీరో చెప్పుకునే ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కలర్ ఫుల్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించారు. తమన్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా వుంది. బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ .. కాజల్ గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.

bellamkonda
kajal
mehreen
  • Error fetching data: Network response was not ok

More Telugu News