bellamkonda srinivas: 'కవచం'లో ఊహించని మలుపులుంటాయి: బెల్లంకొండ శ్రీనివాస్

- యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది
- పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను
- తప్పకుండా హిట్ కొడతాను
మొదటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు భారీతనంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడం లేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన 'కవచం' సినిమా చేశాడు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నారు.
