Andhra Pradesh: టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి జగన్ సిద్ధమయ్యాడు.. కానీ కేటీఆర్ అడ్డుపడ్డాడు!: వర్ల రామయ్య

  • కేసీఆర్ హామీల అమలులో విఫలమయ్యారు
  • అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి
  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలం అయ్యారని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. అలాంటి కేసీఆర్ ను తెలంగాణ ప్రజలంతా ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితులను టీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేవేస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీకి వేసినట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణలో ఏ ప్రాజెక్టులనూ అడ్డుకోలేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానని వైసీపీ అధినేత జగన్ ముందుకొచ్చారని రామయ్య ఆరోపించారు. అయితే అందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించలేదనీ, ప్రచారం చేయాల్సిన అవసరం లేదని సున్నితంగా ఆయన ప్రతిపాదనను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారో, ఎవరి పక్షాన నిలబడ్డారో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
Telangana
Vijayawada
Jagan
YSRCP
KTR
varla ramaiah
TRS
  • Loading...

More Telugu News