chandrababu: హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని 2004లోనే రాహుల్ గాంధీ చెప్పారు: చంద్రబాబు

  • రాహుల్ గాంధీని అభినందిస్తున్నా
  • కేసీఆర్ కట్టింది ఫాంహౌస్ మాత్రమే
  • 12న ఆయన ఫాంహౌస్ కు చేరుకుంటారు

2004లో టీడీపీ ఓడిపోయినప్పుడే... హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబేనని రాహుల్ చెప్పారని... అందుకు రాహుల్ ను అభినందిస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాదును అన్ని విధాలా తాను అభివృద్ధి చేశానని... కేసీఆర్ గారు మీరేమైనా చేశారా? అని అడుగుతున్నానని చెప్పారు. కేసీఆర్ కట్టింది ఫాంహౌస్ మాత్రమేనని... 11వ తేదీన ఓడిపోయిన తర్వాత 12వ తేదీన ఆయన ఫాంహౌస్ కు వెళ్లిపోతారని అన్నారు. మిషన్ భగీరథలో పైపులు మాత్రమే ఉన్నాయని, నీళ్లు మాత్రం రాలేదని, ప్రభుత్వం వద్ద డబ్బులు కూడా అయిపోయాయని ఎద్దేవా చేశారు. కోదాడలో బహిరంగసభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

chandrababu
Rahul Gandhi
hyderabad
kodad
Telugudesam
congress
TRS
kcr
  • Loading...

More Telugu News