Chandrababu: తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ పెద్ద అడ్డంకి: చంద్రబాబు

  • వనరులు పుష్కలంగా ఉన్నా రాష్ట్రంలో ప్రగతి లేదని విమర్శ
  • అభివృద్ధి ఫలాలన్నీ కేసీఆర్‌ కుటుంబమే అనుభవిస్తోందని ధ్వజం
  • ప్రజా కూటమి గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవని, కానీ రాష్ట్రం అభివృద్ధి చెందక పోవడానికి కేసీఆర్‌  పెద్ద అడ్డంకి అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆశ్వారావుపేట ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఓ నియంత అని, ఎవరి మాటా వినరని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోని అభివృద్ధి ఫలాలన్నీ కేసీఆర్‌ కుటుంబమే అనుభవిస్తోందని ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే పోడు భూముల్ని రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ దేశాన్ని భ్రష్టుపట్టించారని, ఆయనను ఓడించేందుకే కాంగ్రెస్‌తో జతకలిశానని చెప్పుకొచ్చారు. దేశంలోని అన్ని పార్టీలను ఒక తాటిపైకి తెస్తున్నానని తెలిపారు.

Chandrababu
KCR
aswaraopeta
  • Loading...

More Telugu News