dhanush: 'మారి 2' ట్రైలర్ తో అదరగొట్టేస్తోన్న ధనుశ్

  • బాలాజీ మోహన్ నుంచి 'మారి 2'
  • ఆటో డ్రైవర్ పాత్రలో సాయిపల్లవి 
  • ఈ నెల 21వ తేదీన విడుదల    

ధనుశ్ తాజా చిత్రంగా 'మారి 2' చిత్రం నిర్మితమైంది. గతంలో ఘన విజయాన్ని అందుకున్న 'మారి' సినిమాకి ఇది సీక్వెల్. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యాక్షన్ .. కామెడీ సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

మాస్ రాజాగా ధనుశ్ డిఫరెంట్ లుక్ తో .. స్టైల్ తో కనిపిస్తూ ఉండగా, ఆటో డ్రైవర్ గా సాయిపల్లవి కనిపిస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఈ ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందనే చెప్పాలి. 'మారి' మాదిరిగానే 'మారి 2' కూడా మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుశ్ ఖాతాలో మరో హిట్ చేరిపోయినట్టేనని ఆయన అభిమానులు బలంగా చెబుతున్నారు.

dhanush
sai pallavi
  • Error fetching data: Network response was not ok

More Telugu News