rajani: ఫస్టులుక్ తో అదరగొట్టేస్తోన్న విజయ్ సేతుపతి

  • రజనీ హీరోగా రూపొందిన 'పెట్టా'
  • కీలకమైన పాత్రలో విజయ్ సేతుపతి 
  • ముఖ్య పాత్రల్లో సిమ్రాన్ .. త్రిష    

ఒక వైపున కథానాయకుడిగా విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వెళుతోన్న విజయ్ సేతుపతి, ఇతర స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను సైతం చేస్తున్నాడు. అలా 'సైరా' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తోన్న ఆయన, రజనీకాంత్ 'పెట్టా'లోను ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తాజాగా ఆయన ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ ఫస్టులుక్ ను బట్టి .. ఆయన ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకి భిన్నంగా ఈ పాత్ర వుండనున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రజనీ భార్య పాత్రలో సిమ్రాన్ నటించగా మరో కథానాయికగా త్రిష కనిపించనుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో రజనీ అభిమానులు వున్నారు.    

rajani
vijay sethupathi
  • Loading...

More Telugu News