nithya menon: జయలలిత బయోపిక్ నుంచి నిత్యామీనన్ పోస్టర్

  • పెరుగుతోన్న బయోపిక్ ల జోరు 
  • జయలలితగా నిత్యా మీనన్ 
  • దర్శకుడిగా ప్రియదర్శిని  

ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. తెలుగులో ఎన్టీఆర్ .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ లు సెట్స్ పై వున్నాయి. ఇక కాంతారావు బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించారు. చివరికి ఆ అవకాశం నిత్యామీనన్ కి దక్కింది.

నిత్యామీనన్ ప్రతిభ కలిగిన నటి అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె స్కిన్ టోన్ .. గ్లామర్ .. హైట్ ఇవన్నీ కూడా జయలలితకు కాస్త దగ్గరగా ఉండటం వలన, ఈ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనుకున్నారు. 'ది ఐరన్ లేడీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి, తాజాగా నిత్యామీనన్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందనే బలమైన నమ్మకంతో నిత్యామీనన్ వుంది.  

  • Loading...

More Telugu News