paruchuri: నేను మరిచిపోలేని సంఘటన ఒకటి వుంది: పరుచూరి గోపాలకృష్ణ
- వేజెళ్ల గారు సాహసించి వేషం ఇచ్చారు
- ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది
- మా అమ్మాయి వెక్కి వెక్కి ఏడ్చేసింది
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. " వేజెళ్ల సత్యనారాయణగారు సాహసించి 'ఈ పిల్లకి పెళ్లవుతుందా?' సినిమాలో నాకు వేషం ఇచ్చారు. వేరే దర్శకులైతే కొత్త ఆర్టిస్టుకి ఆ వేషం ఇవ్వరు. గోపాలకృష్ణకి ఈ వేషం ఇవ్వడమేంటి? అని చాలామంది అనుకున్నారు. అలాంటిది ఈ సినిమా 50 రోజులు ఆడిన సందర్భంగా ఒక దినపత్రికలో నా ఫోటో మాత్రమే వేశారు.
ఇక ఈ సినిమాకి సంబంధించి నేను ఎప్పటికీ మరిచిపోలేని ఒక సంఘటన వుంది. చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది .. పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే సీన్ అది. అది చూసిన మా మూడవ అమ్మాయి హరిప్రియ 'మా నాన్నను ఏమీ చేయకండి .. మా నాన్నను ఏమీ చేయకండి' అంటూ కిందపడి దొర్లుతూ ఏడ్చేస్తోంది. 'ఇదంతా సినిమా కోసమమ్మా .. నిజం కాదు .. వీళ్లంతా ఉత్తుత్తి పోలీసులే' అని చెప్పినా వినిపించుకోకుండా వెక్కి వెక్కి ఏడ్చేసింది" అంటూ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ నవ్వేశారు.