nithin gadkari: రాజస్థాన్‌లో బీజేపీ విజయం ఖాయం : కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ జోస్యం

  • మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో కూడా విజయ దుందుభి మోగిస్తామని వెల్లడి
  • మూడు రాష్ట్రాల్లో పార్టీకి తిరుగు లేదని వ్యాఖ్య
  • గతం కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని స్పష్టీకరణ

ఓపక్క సర్వేలన్నీ బీజేపీ ఓడిపోతుందని చెబుతున్నా, ముఖ్యమంత్రి వసుంధరరాజే సింథియాపై వ్యక్తిగతంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నా కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వాటన్నింటిని కొట్టిపారేశారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో బీజేపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని జోస్యం చెప్పారు. దీంతోపాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లో కూడా అత్యధిక స్థానాల్లో తాము విజయం సాధించనున్నామని చెప్పుకొచ్చారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ డిసెంబరు 11 తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడనున్నాయని స్పష్టం చేశారు.

nithin gadkari
rajastan madyapradesh chattishgarh
winning word
  • Loading...

More Telugu News