Chandrababu: ఆఖరి వ్యూహం... టీటీడీపీ, టీపీసీసీ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

  • ఎన్నికల వేళ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చ
  • హాజరైన ప్రముఖ నేతలు
  • పలు అంశాలపై దిశానిర్దేశం

తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ పార్టీయే అయినా మహా కూటమిలో భాగస్తునిగా అన్నీ తానే అయి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆఖరి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం టీటీడీపీ, టీపీసీసీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తెలుగుదేశం పార్టీ నుంచి మండవ వెంకటేశ్వరరావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి హాజరుకాగా, కాంగ్రెస్‌ తరపున కుంతియా, మర్రి శశిధర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తాజాగా మారిన రాజకీయ సమీకరణాలు, ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలంకుషంగా చర్చించినట్టు సమాచారం. అవసరమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం కూడా ముగుస్తున్న విషయం తెలిసిందే.

Chandrababu
Telugudesam
TPCC
meet
  • Loading...

More Telugu News