rajani: 'బాహుబలి' రికార్డును అధిగమించిన '2.ఓ' హిందీ వెర్షన్

  • హిందీ వెర్షన్ కి ఎక్కువ ఆదరణ 
  • 'బాహుబలి 2' రికార్డును అందుకోవడం కష్టం 
  • 5 రోజుల్లో 451కోట్ల వసూళ్లు      

భారీ అంచనాల మధ్య విడుదలైన '2.ఓ' .. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు.. తమిళ భాషల్లోనే కాదు హిందీలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. తెలుగు .. తమిళ భాషలతో పోలిస్తే హిందీ వెర్షన్లో ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. హిందీ వెర్షన్లో ఈ సినిమా 'బాహుబలి' వసూళ్లను అధిగమించింది.

హిందీ వెర్షన్ 'బాహుబలి' ఫుల్ రన్ లో 117 కోట్ల షేర్ ను వసూలు చేసింది. '2.ఓ' హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే 120 కోట్ల షేర్ ను రాబట్టి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అయితే ఈ సినిమా 'బాహుబలి 2' రికార్డును అధిగమించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే 'బాహుబలి 2' హిందీ వెర్షన్ 511 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అందువలన ఈ రికార్డును అందుకోవడం అసాధ్యమేనని చెబుతున్నారు. '2.ఓ'  ప్రపంచవ్యాప్తంగా 3 భాషల్లోను కలుపుకుని 5 రోజులకు గాను 451 కోట్లను రాబట్టింది. 

  • Loading...

More Telugu News