Telangana: పోలింగ్ ముగిసే వరకు డ్రై డే.. మద్యం తాగి పోలింగ్ స్టేషన్‌కు వస్తే..!

  • పోలింగ్ కేంద్రాల వద్ద ధూమపానం నిషేధం
  • మద్యం తాగి వస్తే అరెస్టే
  • అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష

తెలంగాణలో పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పోలింగ్ ముగిసే వరకు మద్య నిషేధం (డ్రైడే) అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాలను ధూమపాన నిషేధ కేంద్రాలుగా ప్రకటించి స్టిక్కర్లు అంటించింది. మద్యం తాగి ఎవరైనా పోలింగ్ కేంద్రానికి వస్తే అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

ఇక, నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండడంతో ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఏవీ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎక్కడా, ఏ రూపంగానూ ప్రచార ప్రకటనలను ప్రసారం చేయరాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు. అలాగే, ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు కూడా చేపట్టరాదన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదంటే రెండూ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Telangana
Elections
Dry day
Polling
Rajth kumar
Liquor
  • Loading...

More Telugu News