TRS: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడి

  • ప్రచారంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ 
  • కుర్చీలతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
  • పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు

తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గుంతపల్లిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇరు వర్గాలు పరస్పర దాడికి పాల్పడ్డాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ దాడికి దారి తీసింది. టీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేయడంతో పాటు అక్కడే ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేశారు.

TRS
Congress
Ranga Reddy District
Gunthapalli
  • Loading...

More Telugu News