lagadapati: లగడపాటివి సర్వేలు కాదు చిలుక జోస్యాలు: కేటీఆర్ సెటైర్లు

  • సర్వేల పేరిట గందరగోళం సృష్టించే ప్రయత్నం
  • లగడపాటి, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్ట్ లు
  • డిసెంబర్ 11న తట్టాబుట్టా సర్దుకుని వారు వెళ్లాల్సిందే

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో పాక్షిక వివరాలను ఈరోజు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్ పార్టీ వైపే ఉందని లగడపాటి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో నిర్వహించిన రోడ్ షో వేదికగా ఆయన మాట్లాడుతూ, లగడపాటివి సర్వేలు కాదని, చిలుక జోస్యాలని అన్నారు. సర్వేల పేరిట గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లగడపాటి, చంద్రబాబులు పొలిటికల్ టూరిస్ట్ లని, డిసెంబర్ 11న తట్టాబుట్టా సర్దుకుని వారు వెళ్లాల్సిందేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

lagadapati
KTR
TRS
Chandrababu
survey
  • Loading...

More Telugu News