Revanth Reddy: నాపై దాడులు జరగొచ్చు.. పాత్రికేయ మిత్రులారా కెమెరాలతో సిద్ధంగా ఉండండి: రేవంత్ రెడ్డి

  • టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడొచ్చు
  • నాకు పక్కా సమాచారం ఉంది
  • కొడంగల్ ప్రజలు నాకు రక్షణగా ఉన్నారు

'పాత్రికేయ మిత్రుల్లారా! కెమెరాలు పెట్టుకుని సిద్ధంగా ఉండండి, ఎందుకంటే, ఏ క్షణమైనా నాపై దాడులు జరగొచ్చని నాకు పక్కా సమాచారం ఉంది' అంటూ టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సూచించారు. కొడంగల్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, విచక్షణ కోల్పోయిన టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడవచ్చని తనకు సమాచారం అందిందని, తన రక్షణ విషయంలో తనకు భయం లేదని, వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని అన్నారు.

కేసీఆర్ తన ప్రైవేట్ సైన్యాన్ని తెచ్చుకున్నా కూడా, కొడంగల్ ప్రజలు తనకు రక్షణగా ఉన్నంతసేపు తనను ఆయనేమీ చేయలేరని అన్నారు. కేసీఆర్ కు భయపడేదే లేదని, డిసెంబర్ 12న తమ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్ చేసిన అన్యాయాలకు, అక్రమాలకు వడ్డీతో సహా అసలు లెక్క చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించారని, అలా వ్యవహరించని అధికారులకు కూడా చెబుతున్నానని, తాము అధికారంలోకి రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Revanth Reddy
kcr
kodangal
TRS
t-congress
  • Loading...

More Telugu News