Narendra Modi: కాంగ్రెస్ పార్టీ నాకు ఫత్వా జారీ చేస్తోంది: మోదీ

  • ముగియనున్న రాజస్థాన్ ఎన్నికల ప్రచారం
  • మోదీ, రాహుల్ పోటాపోటీ ప్రచారం
  • ‘భారత్ మాతా కీ జై’పై మాటల యుద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండటంతో మోదీ, రాహుల్ పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా మోదీ.. తాజాగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

మోదీ ఎక్కడికెళ్లినా 'భారత్ మాతా కీ జై' అంటుంటారని, నిజానికి ఆయన అనిల్ అంబానీ, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు 'జై కొట్టాలని' అనడానికి బదులు 'భారత్ మాతా కీ జై' అంటుంటారని రాహుల్ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన మోదీ ‘‘భారత్ మాతా కీ జై’ అనకుండా రాహుల్ నన్నెలా నిలువరించగలరు? నేను ఆ నినాదంతో ర్యాలీ ప్రారంభించకూడదని కాంగ్రెస్ జారీ చేస్తున్న ఫత్వాకు ఆ పార్టీ సిగ్గుపడాలి. వారికి మాతృభూమి పట్ల ఉన్న గౌరవం అదేనా?’ అంటూ మోదీ ఎద్దేవా చేశారు.

Narendra Modi
Rahul Gandhi
Congress
Rajasthan
Election campaign
  • Loading...

More Telugu News