Trans Gender: ట్రాన్స్‌జెండర్ మహిళా పోలీస్ ఆత్మహత్యాయత్నం.. వీడియో వైరల్

  • ఆర్మ్‌డ్ ఫోర్స్ విభాగంలో చేరిన నస్రియా
  • అవమానించారని ఆత్మహత్యాయత్నం
  • రామనాథపురం ఆసుపత్రికి తరలింపు

ఓ ట్రాన్స్ జెండర్ మహిళా పోలీస్ ఆత్మహత్యాయత్నం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో కలకలం రేపుతోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నస్రియా అనే ట్రాన్స్‌జెండర్ కొద్ది నెలల క్రితం ఆర్మ్‌డ్ ఫోర్స్ విభాగంలో చేరారు. ముగ్గురు సీనియర్ అధికారులు తనకు క్రమశిక్షణ లేదని అవమానించారని ఆమె ఆరోపించారు.

తనకు బతకాలని లేదని.. తన చావుకు ఆ ముగ్గురు అధికారులే కారణమంటూ వీడియోలో వెల్లడించారు. అనంతరం వాటర్ బాటిల్‌లో ఎలుకల మందు కలుపుకుని తాగారు. విషయం తెలుసుకున్న నస్రియా స్నేహితులు ఆమెను రామనాథపురం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని ఎస్పీ తెలిపారు.

Trans Gender
Nasria
Selfie Vedio
Tamilnadu
Social Media
  • Loading...

More Telugu News