Revanth Reddy: గొర్రెను లాక్కుపోయినట్టు పోలీసులు నన్ను లాక్కుపోయారు: రేవంత్ రెడ్డి

  • నిన్న రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లా
  • పోలీసులు నా బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టారు
  • నియంత పాలనలో కూడా ఇంతటి అరాచకం చూడలేదు

నిన్న రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి వచ్చిన తాను అలసిపోయి నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు తన బెడ్ రూమ్ లోకి చొరబడ్డారని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య కొడంగల్ చేరుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు.

తెల్లవారుజామున సుమారు మూడు లేదా నాలుగు గంటల సమయంలో పోలీసులు తన బెడ్ రూమ్ తలుపులు బద్దలుగొట్టి లోపలికొచ్చారని, గొర్రెను లాక్కుపోయినట్టు తనను లాక్కుపోయారని చెప్పారు. నియంత పాలనలో కూడా ఇంతటి అరాచకం చూడలేదని, ప్రజా హక్కుల కోసం గళం విప్పిన తనపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నులమడానికి కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు.

Revanth Reddy
kodangal
t-congress
kcr
TRS
  • Loading...

More Telugu News