Pavan kumar: టీఆర్ఎస్ ప్రచార వాహనం ధ్వంసం.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

  • ప్రచారం నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి
  • అడ్డుగా వచ్చిన టీఆర్ఎస్ ప్రచార వాహనం
  • ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణలో ఎన్నికలకు మరో రెండు రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య వాద ప్రతివాదనలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రచార వాహన ధ్వంసం ఇరువర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది.

అసలు విషయంలోకి వెళితే.. దేవరకద్ర మండలం నాగారంలో మహాకూటమి అభ్యర్థి పవన్ కుమార్ రెడ్డి కొందరు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో టీఆర్ఎస్ ప్రచార వాహనం ఆయనకు అడ్డుగా వచ్చింది. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Pavan kumar
Mahaboobnagar
TRS
Devarakadra
  • Loading...

More Telugu News