Jeevan Reddy: రేవంత్ ఒక బ్రహ్మోస్ మిసైల్.. టీఆర్ఎస్ కథను ముగిస్తుంది: జి.ఎన్. రెడ్డి

  • పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారు
  • ఇలాంటి పరిస్థితి భారతదేశంలోనే లేదు
  • నేటి సాయంత్రం రేవంత్‌ విడుదల

పోలీసులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత జి.ఎన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేటి తెల్లవారుజామున కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు.

పోలీసులను ఏకంగా బెడ్ రూమ్‌లోకి కూడా పంపించి అరెస్ట్ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. నేటి వరకూ ఇలాంటి పరిస్థితి భారతదేశం ఎక్కడా లేదన్నారు. రేవంత్ ఒక బ్రహ్మోస్ మిసైల్ అని.. ఆ మిసైల్ టీఆర్ఎస్ కథను ముగిస్తుందని జి.ఎన్. రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉంచితే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలతో నేటి సాయంత్రం 4 గంటలకు రేవంత్‌ను పోలీసులు విడుదల చేశారు.  

Jeevan Reddy
KCR
TRS
Congress
Revanth Reddy
  • Loading...

More Telugu News