vijaya shanthi: తెలంగాణ ప్రజల నెత్తుటి కూడు తింటున్నారు: విజయశాంతి

  • కేసీఆర్ కుటుంబంలోని నలుగురు.. నాలుగు కోట్ల మందిని మోసం చేస్తున్నారు
  • గజ దొంగను గద్దె దింపేందుకే మహాకూటమి ఏర్పడింది
  • కేటీఆర్ సీఎం కావాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల నెత్తుటి కూడును తింటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ లాంటి గజ దొంగను గద్దె దింపేందుకే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ ను ఓడించేందుకే తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని అన్నారు. కుమారుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయం తప్ప... రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్ కు తపన లేదని దుయ్యబట్టారు. 

vijaya shanthi
kcr
KTR
congress
TRS
  • Loading...

More Telugu News