ntr: రాజమౌళి సినిమా కోసం బరువు పెరిగిన ఎన్టీఆర్

  • షూటింగు దశలో రాజమౌళి మూవీ
  • డిఫరెంట్ లుక్ తో చరణ్ 
  • బొద్దుగా కనిపించనున్న ఎన్టీఆర్  

రాజమౌళి తన సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. 'బాహుబలి' విషయంలో ఆయా పాత్రధారుల లుక్స్ బయటికి రాకుండా ఉండటం కోసం ఆయన లొకేషన్ లోకి సెల్ ఫోన్లు అనుమతించలేదు. ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయంలోను ఆయన అదే పద్ధతిని అనుసరిస్తున్నాడని అంటున్నారు.

ఈ సినిమాలో చరణ్ .. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. హెయిర్ స్టైల్ .. గెడ్డం .. మీసకట్టు .. వస్త్రధారణ విషయంలో మాత్రమే చరణ్ డిఫరెంట్ గా కనిపిస్తాడు. ఎన్టీఆర్ మాత్రం బాగా బరువు పెరిగి కాస్త లావుగానే కనిపించనున్నాడని అంటున్నారు. 'అరవింద సమేత'లో సిక్స్ ప్యాక్ లో కనిపించిన ఎన్టీఆర్ ను, అందుకు పూర్తి భిన్నమైన లుక్ లో చూపించనున్నారట. కెరియర్ ఆరంభంలో మాదిరిగా ఎన్టీఆర్  బాగా బొద్దుగానే కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు.     

  • Loading...

More Telugu News