Telangana: తెలంగాణలో మాజీ ఎమ్మెల్యేను వేదికపైకి రాకుండా అడ్డుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్!

  • వేదికపైకి రాబోయిన తాటికొండ వెంకటేశ్వర్లు
  • చేతితో అడ్డుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
  • వెనక్కి వెళ్లిపోయి ప్రజల్లో కలియతిరిగిన నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. ఎన్నికల ప్రచారానికి నేటితో రెండ్రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రోజుకు 6-8 సభలు ఏర్పాటు చేస్తూ తమ పాలనలో జరిగిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కాగా, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.

సత్తుపల్లిలో ప్రజాఆశీర్వాద సభ సందర్భంగా వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్ ఒక్కసారిగా ఆగిపోయారు. అనంతరం అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లును సభావేదిక పైకి ఎక్కకుండా ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. మిగతా నేతలంతా పైకి వెళ్లాలని సూచించారు. సాక్షాత్తూ సీఎం అడ్డుకోవడంతో వెంకటేశ్వర్లు రెండు చేతులతో దండం పెడుతూ వెనక్కి మళ్లారు. అనంతరం సభా ప్రాంగణంలో తిరుగుతూ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, కేసీఆర్ ఇలా ఎందుకు వ్యవహరించాన్న విషయమై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది.

Telangana
sattupalli
mla
humiliation
TRS
KCR
tatikonda venkateswarlu
  • Loading...

More Telugu News