Motkupalli Narsimhulu: సర్వే చేయించా... గెలిచేది మీరేనంటూ మోత్కుపల్లికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన పవన్ కల్యాణ్!

  • చంద్రబాబుతో విభేదించిన మోత్కుపల్లి నర్సింహులు 
  • ఆలేరు నుంచి స్వతంత్రుడిగా బరిలోకి
  • మీరే గెలుస్తారని చెప్పిన పవన్ కల్యాణ్

టీడీపీ మాజీ నేత, చంద్రబాబుతో విభేదించి, ఆ పార్టీకి రాజీనామా చేసి, ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాభినందనలు తెలిపారు. మోటకొండూరు మండలంలో మోత్కుపల్లి ప్రచారం చేసుకుంటుండగా, పవన్ నుంచి ఫోన్ వచ్చింది. తెలంగాణలో తాను ఓ స్వతంత్ర బృందంతో సర్వే జరిపించానని, ఆలేరులో మీరే గెలుస్తారని తేలిందని పవన్ వ్యాఖ్యానించారు. గెలవబోతున్న మీకు అభినందనలని చెప్పారు. కాగా, తెలంగాణలో తన మద్దతుదారులు ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని 5వ తేదీ బుధవారం నాడు తెలియజేస్తానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Motkupalli Narsimhulu
Aler
Telangana
Pawan Kalyan
  • Loading...

More Telugu News