Andhra Pradesh: తెలంగాణ ఎన్నికల కోసం టీడీపీ నేతలు ఒక్కో బస్సులో రూ.10 కోట్లు పంపుతున్నారు!: విజయసాయిరెడ్డి ఆరోపణ

  • అనామకులతో వీటిని చేరవేస్తున్నారు
  • అన్నింటిని సాక్ష్యాలతో బయటపెడతా
  • రాహుల్ కు బాబు రూ.5 వేల కోట్లు ఇవ్వబోతున్నారు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు భారీగా నగదును వెదజల్లుతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు చెందిన ఒక్కో బస్సులో రూ.10 కోట్ల చొప్పున పంపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం యరపతినేని శ్రీనివాస్, రాజేష్, గోపి, సుబ్బారావు అనే అనామకులను ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే సాక్ష్యాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. ఇదే పద్ధతిని కర్ణాటక ఎన్నికల సందర్భంగా అక్కడి నేతలు వాడారని సాయిరెడ్డి చెప్పారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తన వాటాగా చంద్రబాబు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి రూ.5,000 కోట్లు అందించబోతున్నారని ఆరోపించారు. జాతీయ వాటా కింద ఈ అవినీతి సొమ్మును బాబు పంపుతున్నారని విమర్శించారు. అవినీతిలో చంద్రబాబు హిమాలయాల అంచులకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలు బయటపెట్టినందుకు చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు తనపై క్రిమినల్ కేసులు పెట్టి వేధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయినా తాను భయపడబోనని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telangana
election-2018
Chandrababu
RS.10 crore
RS.5000 crores
YSRCP
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News