dk aruna: ఓటమి భయంతోనే రేవంత్ ను అరెస్ట్ చేశారు: డీకే అరుణ

  • టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుంది
  • అప్రజాస్వామికంగా రేవంత్ ను అరెస్ట్ చేశారు
  • నియంత పోకడలను తెలంగాణ ప్రజలు హర్షించరు

కొడంగల్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని... అందుకే అప్రజాస్వామికంగా రేవంత్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

టీఆర్ఎస్ నేతలకు అనుగుణంగా పోలీసులు, అధికారులు పని చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్ లో దారుణాలు చోటు చేసుకుంటున్నా... ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందని అన్నారు. ఇలాంటి నియంత పోకడలను తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని అన్నారు. 

dk aruna
Revanth Reddy
arrest
congress
kodangal
TRS
  • Loading...

More Telugu News