Telangana: తెలంగాణలో ఓడితే కేసీఆర్ బీజేపీ గూటికే.. అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు!

  • కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు పాలిస్తుంది
  • ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీజేపీనే
  • మామాట వినకుంటే వ్యూహాన్ని మార్చుకుంటాం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు ఆల్ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ మిత్రపక్షంపై మజ్లిస్ నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒడిపోతే సీఎం కేసీఆర్ బీజేపీ గూటికి చేరుకుంటారని తెలిపారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరో 5-10 ఏళ్లు కొనసాగుతుందని జోస్యం చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

అందుకే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరోసారి కేసీఆర్ కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ తమ మాట వినకుంటే పరిస్థితులను బట్టి రాజకీయ వ్యూహాలను మార్చుకుంటామని తెలిపారు. పాతబస్తీలో జరిగిన మజ్లిస్ బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Telangana
KCR
TRS
Akbaruddin Owaisi
aimim
BJP
Congress
  • Loading...

More Telugu News