BJP: మీరు మీరు తిట్టుకోండయ్యా.. మధ్యలో మమ్మల్నెందుకు లాగుతారు?: కిషన్ రెడ్డి

  • మోదీపై కేసీఆర్ దిగజారి మాట్లాడుతున్నారు
  • కేసీఆర్‌ను ఎప్పుడైనా చులకన చేసి మాట్లాడామా?
  • మా జోలికొస్తే జాగ్రత్త

కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలపై బీజేపీ అంబర్‌పేట అభ్యర్థి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు దిగజారి ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. బీజేపీ నేతలు ఏనాడూ కేసీఆర్‌ను చులకన చేసి మాట్లాడలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వారు, వారు ఎంత తిట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్న కిషన్ రెడ్డి మధ్యలో తమను మాత్రం లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికి వస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు.

BJP
Kishan Reddy
Telangana
Ambarpet
Congress
TRS
  • Loading...

More Telugu News