Biggboss: బిగ్ బాస్ షో: సురభిని 'వ్యభిచారి' అంటూ తిట్టి... తలను గోడకేసి బాదుకున్న క్రికెటర్ శ్రీశాంత్!

  • నాటకీయంగా సాగుతున్న హిందీ బిగ్ బాస్ 12వ సీజన్
  • సురభి రానాతో గొడవపడ్డ శ్రీశాంత్
  • ఇద్దరు హద్దులు దాటి విమర్శలు

హిందీ బిగ్‌బాస్ 12వ సీజన్ రోజురోజుకూ మరిన్ని నాటకీయ ఘటనలతో ఆసక్తికరంగా మారుతోంది. తోటి హౌస్‌ మేట్ సురభి రానాతో గొడవ పడ్డ క్రికెటర్ శ్రీశాంత్, తన తలను బాత్ రూమ్ గోడకేసి కొట్టుకోవడంతో గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

ఈ గొడవకు ముందు శ్రీశాంత్, సురభిల మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఇద్దరూ హద్దులు దాటారు. శ్రీశాంత్ పై వ్యక్తిగత దూషణలకు దిగిన సురభి, అతను మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని దుమ్మెత్తి పోసింది. ఆ వెంటనే శ్రీశాంత్ సైతం ఆగ్రహంతో, సురభిని ఓ వ్యభిచారి అంటూ సంబోధించాడు.

ఆపై తన తొందరపాటుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఆ తరువాత తనలో తాను కుమిలిపోతూ, బాత్ రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని, తలను గోడకేసి బాదుకున్నాడు. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యమూ ఏదో రకంగా వార్తల్లో ఉంటున్న శ్రీశాంత్‌ కు అభిమానులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ సీజన్ లో టైటిల్ గెలిచే చాన్స్ ఉన్నవారిలో శ్రీశాంత్ ఉన్నాడని అంటున్నారు.

Biggboss
Hindi
Season - 12
Srisant
Surabi rana
  • Loading...

More Telugu News