Uttar Pradesh: ఆవు కళేబరాన్ని చూసి రెచ్చిపోయిన గోరక్షక ముఠా... సీఐ సహా ఇద్దరి మృతి!

  • బులంద్ షహర్ లో ఘటన
  • ఎముకలను స్టేషన్ వద్దకు తెచ్చి నిరసనలు
  • అదుపు తప్పిన పరిస్థితి, పలు వాహనాలు దగ్ధం

ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ లో ఆవు కళేబరాన్ని చూసిన గోరక్షక ముఠా రెచ్చిపోగా, ఆపై జరిగిన అల్లర్లలో ఓ సీఐ సహా మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిధిలోని మెహౌ గ్రామం వద్ద కళేబరం కనిపించగా, ఓ మతానికి చెందినవారే ఆవును చంపేశారని ఆరోపిస్తూ గోరక్షక, హిందూ సంఘాలు రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగాయి.

 ఆ ఎముకల్ని నిరసనకారులు ట్రాక్టర్‌ లో వేసుకుని ఛింగర్వతి పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు తీసుకొచ్చి, బులంద్‌ షెహర్‌ – గఢ్‌ రహదారిని దిగ్బంధించారు. జిల్లా కలెక్టర్‌ అనూజ్‌ కుమార్, సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ అవినాశ్‌ రంగంలోకి దిగి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, అక్కడకు చేరుకోగా, నిరసనకారులు రాళ్ల వర్షం కురిపించారు. స్థానిక పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ కు నిప్పంటించారు. పలు వాహనాలను దగ్ధం చేశారు. దుండగుల దాడిలో ఇన్‌ స్పెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ మరణించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో సుమిత్‌ అనే యువకుడు కన్నుమూశాడు. పరిస్థితి మరింతగా విషమించకుండా పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News