Revanth Reddy: అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ పై పోలీసుల వివరణ!

  • ఈ తెల్లవారుజామున బలవంతంగా అరెస్ట్
  • నేటి కేసీఆర్ సభను అడ్డుకుంటామన్న రేవంత్
  • శాంతి భద్రతల సమస్య వస్తుందనే అరెస్ట్ చేశామన్న పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఈ తెల్లవారుజామున బలవంతంగా అరెస్ట్ చేయడం కొడంగల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపగా, పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. నేడు కోస్గిలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటామని, సభను జరగనివ్వబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రేవంత్ తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డిని, ఇతర ప్రధాన అనుచరులను అరెస్ట్ చేశామని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసేందుకే ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

Revanth Reddy
Arrest
Kodangal
Police
  • Loading...

More Telugu News