Revanth Reddy: రేవంత్‌ను జడ్చర్లకు తరలించిన పోలీసులు.. రేవంత్ నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

  • ఈ తెల్లవారుజామున అరెస్ట్ 
  • జడ్చర్ల పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలింపు
  • రేవంత్ సోదరులు, గన్‌మెన్లు కూడా అరెస్ట్

కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను జడ్చర్లలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో రేవంత్ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుగొట్టి రేవంత్‌ను లాక్కెళ్లారు.

తనపై దాడులకు నిరసనగా నేడు కొడంగల్‌లో నిర్వహించనున్న కేసీఆర్ సభను అడ్డుకుంటానని రెండు రోజుల క్రితం రేవంత్ హెచ్చరించారు. అలాగే, నేడు కొడంగల్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈసీ ఆదేశాల మేరకు రేవంత్‌పై కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కేసులు నమోదు చేశారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఇంటి వాచ్‌మెన్, గన్‌మెన్లతోపాటు ఆయన సోదరులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Revanth Reddy
kodangal
Jadcharla
Arrest
KCR
TRS
Telangana
  • Loading...

More Telugu News