KTR: కేటీఆర్ సభలో డబ్బులు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

  • పెద్దపల్లిలో కేటీఆర్ బహిరంగ సభ
  • సభకు వచ్చిన వారికి డబ్బులు పంచుతూ దొరికిన నేతలు
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీఆర్ఎస్ నేత కేటీఆర్ సభలో డబ్బులు పంచుతుండగా ముగ్గురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెద్దపల్లి‌లో సోమవారం కేటీఆర్ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన ప్రజలకు టీఆర్ఎస్ నేతకు చెందిన ఓ హోటల్‌లో డబ్బులు పంచుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడిచేశారు.

మున్సిపల్ చైర్మన్ ఎలువాక రాజయ్య, జావిద్, అమ్రిశ్‌లు అక్కడ ఓటర్లకు డబ్బులు పంచుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 38,350 స్వాధీనం చేసుకున్నారు. నిజానికి వారి వద్ద నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, పోలీసులు దీనిని ఖండించారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న నేతలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.

ఇక, హుజూరాబాద్‌లోనూ  పోలీసులు సోదాలు నిర్వహించారు. టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ కార్యాలయం పక్కింట్లో ఉండే నారాయణరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.2 కోట్ల నగదు ఉందన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. అయితే, తనిఖీల్లో ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు.

KTR
Peddapalli District
TRS
police
Arrest
Election
  • Loading...

More Telugu News