Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్ట్.. ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పని పోలీసులు

  • ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు
  • రేవంత్ అరెస్ట్‌తో ఉద్రిక్తంగా కొడంగల్
  • నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్

కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు కొడంగల్‌లో జరగనున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభను అడ్డుకుంటానని హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారనే విషయాన్ని చెప్పడం లేదని రేవంత్ భార్య ఆందోళన వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి ఇంటి తలుపులు బద్దలుగొట్టి మరీ పోలీసులు లోపలికి వచ్చారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. బొమ్రాస్‌పేట‌లో నేటి సాయంత్రం వరకు 144 సెక్షన్‌ను విధించిన పోలీసులు ఈసీ ఆదేశాలతో రేవంత్‌పై రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Revanth Reddy
Congress
Kodangal
TRS
KCR
Telangana
Arrest
  • Loading...

More Telugu News