Pawan Kalyan: భార్యలను మార్చడం మగతనమా?: పవన్ కల్యాణ్ ని ప్రశ్నించిన జగన్

  • నాలుగేళ్ల కోసారి భార్యను మార్చే పవన్ కల్యాణ్
  • ‘పెళ్లి’ అనే పవిత్ర బంధాన్ని అపహాస్యంపాలు చేశాడు
  • రేణూ దేశాయ్ పై విమర్శలు చేస్తే మౌనంగా ఉండటం మగతనమా?

నాలుగేళ్ల కోసారి భార్యను మార్చే పవన్ కల్యాణ్.. ‘పెళ్లి’ అనే పవిత్ర బంధాన్ని అపహాస్యంపాలు చేశాడని, భార్యలను మార్చడం మగతనమా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, మాజీ భార్య రేణూ దేశాయ్ అన్న మాటలను పవన్ గుర్తుతెచ్చుకోవాలని సూచించారు.

ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తీరుపై మాట్లాడిన రేణూదేశాయ్ పై ఆయన అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తే, పవన్ మౌనంగా ఉండటమే మగతనమా? అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు చంద్రబాబుతో కాపురం చేసిన పవన్, చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధం, మోసం, అవినీతిలో భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు. వైఎస్ పాలనపై విమర్శలు చేస్తున్న పవన్ కు ఆయన పాలన గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పవన్, తన అవినీతిని ఎప్పుడైనా చూశాడా? అంటూ మండిపడ్డారు.

Pawan Kalyan
jagan
renu desai
Chandrababu
ysr
  • Loading...

More Telugu News