Sonali Bendre: ముంబైకి తిరిగొచ్చిన సోనాలి.. అభిమానులకు ఆనందంగా అభివాదం

  • న్యూయార్క్‌లో చికిత్స
  • ముంబైకి తిరిగొచ్చిన సోనాలి
  • ఆరోగ్యంగానే ఉందన్న గోల్డీ బెహల్

క్యాన్సర్‌తో తన పోరాటం ముగియలేదని.. కానీ తన హృదయం ఎక్కడైతే ఉందో అక్కడికే(ముంబై) తిరిగి వెళుతున్నానని ప్రముఖ నటి సోనాలి బింద్రే నిన్న తెలిపిన విషయం తెలిసిందే. క్యాన్సర్‌తో బాధపడుతూ ఆమె కొంతకాలంగా న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె ముంబైకి తిరిగి వచ్చారు. సోనాలికి ఎయిర్‌పోర్టులో స్నేహితులు, బంధువులు, సన్నిహితులు ఘన స్వాగతం పలికారు.

తన భర్త గోల్డీ బెహల్‌తో ముంబైకి వచ్చిన సోనాలి తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ చాలా ఆనందంగా కనిపించారు. సోనాలి ఆరోగ్య పరిస్థితిపై గోల్డీ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి చికిత్స ముగిసిందని.. కానీ మళ్లీ తిరిగి రావచ్చు కాబట్టి రెగ్యులర్ చెకప్‌లు అవసరమన్నారు. ప్రస్తుతం సోనాలి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

Sonali Bendre
Goldi Behl
Mumbai
Newyork
Airport
  • Loading...

More Telugu News