Telangana: రేవంత్ రెడ్డికి షాక్.. కేసు నమోదుచేసిన కొడంగల్ పోలీసులు!

  • కేసీఆర్ ను రేపటి సభకు రానివ్వబోమన్న రేవంత్
  • ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్
  • చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి షాక్ తగిలింది. కొడంగల్ లో ఈ నెల 4న(రేపు) జరిగే ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో కేసీఆర్ ను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈసీ ఆదేశాలతో రేవంత్ రెడ్డిపై 241,188, 506,511 సెక్షన్ల కింద కొడంగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసీఆర్ ను కొడంగల్ లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో టీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను సమర్పించింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. దీంతో కొడంగల్ పోలీసులు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

Telangana
Congress
Revanth Reddy
Police
case
kodangal
Warangal Rural District
KCR
complaint
  • Loading...

More Telugu News